క్రికెట్ బెట్టింగ్ నిందితుల అరెస్ట్
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలో లక్ష్మీవెంకటేశ్వర గోడౌన్ ప్రాంతంలో శుక్రవారం ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను చాగలమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పెద్దవంగలి గ్రామానికి చెందిన చిందలూరి మహబూబ్‌బాషా, స్థానిక పోస్టాఫీసు వీధికి చెందిన అనిమెల దస్తగిరి బాషాలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.50,000లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌ఐ తెలిపారు.


