భక్తుల మనోభావాలతో చెలగాటమా?
● చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
బొమ్మలసత్రం: భక్తుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. శ్రీశైలం బ్రాహ్మణ కరివేన సత్రం గోడ కూల్చివేతలాంటి దాడులు కూటమి ప్రభుత్వానికి సరికాదన్నా రు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లా డుతూ.. శ్రీశైలం ఆలయ అధికారులు కరివేన సత్రం నిర్వాహకులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ కూల్చివేయటం ఎంత వరకు సమంజసమన్నా రు. బ్రాహ్మణులు దైవానికి, భక్తునికి మధ్య సారథులుగా ఉంటారని, వారి ఆధీనంలో నడిచే సత్రం ప్రహరీని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తిరు మల లడ్డూలో జంతుకొవ్వు కలిపారని ఆరోపించిన కూటమి నేతలకు సిట్ నివేదిక చెంపపెట్టుగా మారిందన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయడం చంద్ర బాబు నైజమన్నారు. ఆవునెయ్యిని కల్తీ చేశారని చెబుతూ ఆలయాల మెట్లు శుభ్రం చేసిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు తిరుమల మెట్లు శుభ్రం చేసి ప్రాయశ్చిత్తం కోరుకోవాలన్నారు. హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని హిందువులు మరిచిపోలేదన్నారు.
నోటీసులు ఇవ్వకుండా కూల్చడం దుర్మార్గమే...
శ్రీశైలంలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీని ఆలయ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆలయ అధికారులు గోడను కూల్చారని ఆరోపించారు. ఆలయ అధికారులు కూల్చిన గోడను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పేరుతో హడావుడి చేసే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. తిరుమల లడ్డూపై విషప్రచారం చేసిన నేతలు పుట్టగతులు లేకుండా పోతారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ రాష్ట్ర సెక్రటరీ సద్దల సూర్యనారాయణరెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీగేనా.. నెగ్గేనా !


