జనసేన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ: చిరుద్యోగి అయిన మహిళను బెదిరించి, దురాగతానికి పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రైల్యేకోడూరులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగికి ఐదు సార్లు బలవంతంగా అపరేషన్ చేయించి దుర్మార్గపు పనులకు పాల్పడిన అరవ శ్రీధర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. సమాజంలో చిరుద్యోగిగా జీవనం కొనసాగిస్తున్న మహిళకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు సూచించారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో బెదిరించి మహిళపై బలవంతగా ఇలాంటి నీచపు పనులకు పాల్పడిన జనసేన ఎమ్మెల్యేకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. మహిళలకు తమ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పవన్‌కళ్యాణ్ ప్రతి వేదికపై ప్రసంగాలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


