స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదు
● రిటైర్డు జెడ్పీ సీఈఓ జి.జయపాల్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదని రిటైర్డు జెడ్పీ సీఈఓ జి.జయపాల్‌రెడ్డి అన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా స్థానిక సంస్థలకు అదనంగా నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆచరణలో అవి అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆయా సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకొని స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే స్థానిక సంస్థలు లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నాయన్నారు. ప్రజల చేత ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ మితిమీరిన జోక్యం వల్ల ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
సుమతీ శతకం సినిమా బృందం సందడి
కల్లూరు: దూపాడు సమీపంలోని అశోకా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘సుమతీ శతకం’ సినిమా బృందం సభ్యులు సందడి చేశారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం, వినోద కార్యక్రమాల్లో భాగంగా కాలేజీ యాజమాన్యం ఆ బృందాన్ని ఆహ్వానించింది. సినీ హీరో అమర్‌దీప్, హీరోయిన్ శైలి, దర్శకుడు ఎం.ఎం. నాయుడు, నటులు తేజ, మహేష్ విట్టు తదితరులు కళాశాలలో కలియతిరిగి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
వెల్దుర్తి: కంది, పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వొద్దని జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆయె మండలంలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కంది కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, కొనుగోలు పద్దతులను పరిశీలించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రామళ్లకోట గ్రామ పరిధిలో సాగు చేసిన పొగాకు దిగుబడులను, వేరుశనగ పంటలను పరిశీలించారు. అగ్రిమెంట్‌పై ఐటీసీ కంపెనీ క్వింటం రూ.16,300 ప్రకారం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం రామళ్లకోట ఆర్‌ఎస్‌కేలో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట ఏఓ అక్బర్‌బాషా, కందుల కొనుగోలు కేంద్రం బ్రాంచ్ మేనేజర్ షేక్షావలి ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
పాణ్యం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. హైవేలో ప్రమాదాలు జరగకుండా సచనలు ఏర్పాటు చేయాలన్నారు. పాణ్యంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు పెండిండ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు.
స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదు
స్థానిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తగదు


