స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీగా కిరణ్‌కుమార
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీగా కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన విధుల్లో చేరారు. ఇక్క డ పనిచేస్తున్న జి.కల్యాణి బదిలీపై వెళ్లడంతో అప్పటి నంంచి అనంతపురం డీఐజీ విజయలక్ష్మీని ఇన్‌చార్జిగా కొనసాగించారు. అయితే ఇటీవల కిరణ్‌కుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం కర్నూలు డీఐజీగా నియమించారు.
గృహ నిర్మాణ సందేహాలకు కాల్ చేయండి
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తమ సందేహాల నివృత్తికి ఈ నెల 29న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పీడీ కార్యాలయ ఫోన్ 08518– 257481 నెంబర్‌కు కాల్ చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ చిరంజీవి కోరారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నిర్మాణ సామాగ్రి, సిమెంట్, స్టీల్, బిల్లుల గురించి తమ సందేహాలను ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించిన సమస్యలపై కూడా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


