టీబీ డ్యాంలో 26.5 టీఎంసీలు
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో బుధవారం 1633 అడుగులకు 1603.88 అడుగులతో, 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యంలో 26.062 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో జీరో ఉండగ ఔట్‌ఫ్లో 507 క్యూసెక్కులు నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 1618.09 అడుగులతో 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. జలాశయం గేట్ల ఏర్పాటుకు డిసెంబర్ 10న డ్యాంలో నిల్వ ఉన్న 63 టీఎంసీల నుంచి 31 తేది వరకు ప్రతి రోజు కాలువలకు వదులుతున్న 10 వేల క్యూసెక్కులతో పాటు అదనంగా మరో 7 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులుతూ వచ్చారు. 28 టీఎంసీలకు చేరుకుంటుండగా జనవరి 15న అన్ని కాలువలకు నీటి సరఫరను నిలిపివేశారు. జలాశయంలో నీటి నిల్వ తగ్గితే గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టాలనే టీబీ బోర్డు ఇంజనీర్ల ఆలోచన మేరకు నీటిని తగ్గించారు.


