
బార్లకు అరకొర దరఖాస్తులు
● మరో మూడు రోజుల గడువు పెంపు ● ఈనెల 30న లక్కీ డిప్
కర్నూలు: బార్ల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌కు స్పందన కొరవడటంతో దరఖాస్తుల స్వీకరణకు మరో మూడు రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 47 మద్యం బార్లకు లైసెన్సుల కేటాయింపునకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. దరఖాస్తు దాఖలుకు 26వ తేదీ చివరి రోజు. అయితే కర్నూలు జిల్లాలో 8 బార్లకు కేవలం 31 దరఖాస్తులు, నంద్యాల జిల్లాలో 7 బార్లకు 24 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కనీసం 4 దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తామని ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ లెక్కన కర్నూలులో 4, ఆదోనిలో 3 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి. అలాగే నంద్యాల జిల్లాలో కూడా 5 బార్లకు మాత్రమే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. నందికొట్కూరు, బేతంచెర్ల బార్లకు రెండేసి చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలులో గౌడ కులాలకు రిజర్వు చేసిన దుకాణాలకు రెండు దరఖాస్తులు దాఖలయ్యాయి. మంగళవారం పొద్దుపోయే దాకా ఉమ్మడి జిల్లాలో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
పర్మిట్ రూమ్‌లు మంజూరు చేయడమే కారణమంటున్న వ్యాపారులు
మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు మంజూరు చేయడంతో బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ మంది వ్యాపారులు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. దుకాణాలకు ఇచ్చినట్లుగా కమీషన్ లేకపోవడం, ఒక్క బార్‌కు నాలుగు దరఖాస్తులు వేస్తేనే డ్రా తీయడం వంటి నిబంధనలు వ్యాపారులు భారంగా భావిస్తున్నారు. ఆ నిబంధనల వల్ల నష్టాల బారిన పడటం ఖాయమనే భావనతో చాలామంది వ్యాపారులు దరఖాస్తుకు తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటేవ్యాపారుల నుంచి స్పందన కొరవడటంతో బార్ల దరఖాస్తుకు మరో మూడు రోజుల గడువు పెంచుతూ సవరణ షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30న లక్కీ డిప్ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుంది.