సీసీటీవీ రిపేరీ, సర్వీస్‌లో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సీసీటీవీ రిపేరీ, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

Aug 27 2025 9:07 AM | Updated on Aug 27 2025 9:07 AM

సీసీటీవీ రిపేరీ, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

సీసీటీవీ రిపేరీ, సర్వీస్‌లో ఉచిత శిక్షణ

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సీసీటీవీ రిపేరి, సర్వీస్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ కె.పుష్పక్‌ తెలిపారు. ఈ కోర్సుకు సంబంధించి సెప్టెంబర్‌ 12 నుంచి 13 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు యు వకులు అర్హులని.. శిక్షణా కాలంలో ఉచిత భోజ నం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువకులు కర్నూలు శివారు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరాబ్యాంకు– గ్రామీ ణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్‌డీఏ–టీటీడీసీ ప్రక్కన )లో, లేదా 9000710508 నెంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

సీపీఐ రాష్ట్ర కమిటీలో పలువురు జిల్లా వాసులకు చోటు

కర్నూలు(సెంట్రల్‌): ఆగస్టు 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో నూతనంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జిల్లా నుంచి పలువురికి చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పి.రామచంద్రయ్య, బి.గిడ్డయ్యలను ఎన్నుకున్నారు. రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్‌.లెనిన్‌బాబు, ఎస్‌.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, జి.రంగన్న, పి.శ్రావణి, నబీరసూల్‌లను ఎన్నుకున్నారు. వీరందరికీ జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల తరపున పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

సెల్‌ఫోన్ల రికవరీ

బేతంచెర్ల: మండలంలో చోరీకి గురైన 39 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులు బాధితులకు మంగళవారం సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్‌ పోగొట్టుకుంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌తో లేదా వాట్సాప్‌ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చెక్‌బౌన్స్‌ కేసులో జైలు శిక్ష

నంద్యాల(వ్యవసాయం): చెక్‌బౌన్స్‌ కేసులో జైలు శిక్షను విధిస్తూ స్పెషల్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏసురత్నం మంగళవారం తీర్పు వెల్లడించారు. వివరాలు.. గడివేముల మండల కేంద్రానికి చెందిన నిందితుడు దూదేకుల కమాల్‌బాషా 2019లో లక్ష్మిదేవమ్మ వద్ద వ్యాపార నిమిత్తం అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చేందుకు ఇచ్చిన చెక్కు బ్యాంక్‌లో బౌన్స్‌ కావడంతో జడ్జి విచారణ జరిపి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, చెక్కు మొత్తం రూ.9.10 లక్షలు చెల్లించాలని తీర్పు వెల్లడించారు. అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement