
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి కోరారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ కబర్థి సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్‌లో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, ఎస్‌సీ, ఎస్‌టీ, పౌర హక్కుల రక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల రక్షణ, అమలు పథకం 2015, ఆదివాసీలు, సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.శాంతికళ, ఆర్ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, డీసీపీఓ శారద, జిల్లా సాంఘీక సంక్షేమం, సాధికారత అధికారిణి బీ రాధిక, నంద్యాల ఏటీడబ్ల్యూఓ హుసేనయ్య, నంద్యాల జిల్లా సీఐ పీ గౌతమి, రెండు జిల్లాలకు చెందిన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి