
పని ఒత్తిడి పెరిగిపోయింది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లతో అంగన్‌వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్ పనిచేయకపోవడం, యాప్స్ సపోర్టు చేయడం లేదు. 2జీ సెల్ ఫోన్ స్థానంలో 5 జీ సెల్ ఫోన్లు అందించాలని కోరుతూనే ఉన్నాం. అలాగే వర్కర్లకు నెలకు రూ.26 వేలు, సహాయకులకు రూ.13 వేలు ఇవ్వాలని అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యాప్ వల్ల ఇటీవలి కాలంలో పని ఒత్తిడి పెరిగిపోయింది. ఫేస్ క్చాప్చర్ చేసేందుకే కనీసం గంట సమయం పడుతోంది. – బీ రేణుకమ్మ, జిల్లా అధ్యక్షురాలు,
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ)