
ఒకే యాప్ ప్రవేశ పెట్టాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న బాల సంజీవిని, పోషణ్ ట్రాకర్ యాప్‌లలో ఏదో ఒకదాన్ని మాత్రమే అమలు చేయాలి. రెండు యాప్‌ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. బాల సంజీవిని యాప్‌తో ఒకే సారి దాదాపు 200 మంది ఫేస్ రికగ్నైజ్ చేయలంటే చాలా సమయం పడుతుంది. నాలుగైదు పర్యాయాలు లబ్ధిదారుల నుంచి ఓటీపీ కోరాల్సి ఉంది. నిరక్షరాస్యులైన మహిళల నుంచి ఓటీపీ చెప్పించుకోవడం కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. సెల్‌ఫోన్ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా 5జీ సెల్‌ఫోన్స్ అందించాలి. – కే వెంకటమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( సీఐటీయూ )