
మన పండు బ్రహ్మాండం!
డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా లభిస్తున్న పండు. ఇదివరలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇప్పుడు మనపక్క జిల్లా అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో విరివిగా సాగవుతోంది. అయితే ఇంతకు వెయ్యి రెట్లు బీ12, ఏ, సీ విటమిన్లు లభించే మొక్క మన దేశంలోనే ఉన్న బ్రహ్మజెముడు(పాపిచ్చి కాయ)ను విస్మరిస్తున్నాం. చైనాకు, మన పండుకు ఉన్నా తేడా ఒక్క ముళ్లు మాత్రమే. కేవలం ఈ ఒక్క కారణంతో ముళ్లు తీసుకునే సమయం లేక చైనా పండ్లను ప్రోత్సహిస్తున్నాం. పైగా ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఎవరూ పెంచకుండానే మొండిగా బతికేస్తుంది. అయితే చైనా పండు(డ్రాగన్ ఫ్రూట్)ను మాత్రం కేజీ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే ఫ్రీగా లభిస్తున్న, డ్రాగన్ ఫ్రూట్‌ను మించి పోషకాలను అందిస్తున్న మన బ్రహ్మజెముడును పట్టించుకోకపోవడం గమనార్హం. కార్పొరేట్, కాంక్రీట్ జంగిల్స్‌లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు వీటి గురించి అవగాహన లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పాపాసికాయలు తెలియనివి కావు. పండును బండరాయికేసి రుద్దితే ముళ్లు విరిగిపోతాయి, ఆ తర్వాత తోలు తీసి గుజ్జును తినేయడమే. చివరగా వచ్చే విత్తనాలను మాత్రం పడేయటం విస్మరించొద్దు. ఈ పండ్లు తిన్నామంటే ఎట్టే గర్తుపట్టేయొచ్చు. చేతులు, నాలుక కొద్ది సమయం వరకు ఎరుపు, గులాబి రంగులోకి మారిపోవడం చూస్తే పాపాసికాయలు తిన్నావా అని అడగాల్సిందే. ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజెముడు పండ్లతో కాలేయ, క్యాన్సర్ వ్యాధులను సైతం నయం చేస్తోంది. అంతేకాదు.. స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉండటం విశేషం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

మన పండు బ్రహ్మాండం!

మన పండు బ్రహ్మాండం!

మన పండు బ్రహ్మాండం!

మన పండు బ్రహ్మాండం!