
సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు
మంత్రాలయం: మేళతాళాల సుస్వరాలు.. పండితుల వేద ఘోషలు.. కేరళ డోలు ధ్వానాలు.. భక్తజనుల కోలాహలం మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహవాహనంపై దేదీప్యమానంగా ఊరేగాడు. శ్రీరాఘవేంద్రుడి 354వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటీ సేవలు చేశారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉదయం రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకం చేసి అలంకరించారు. పూజా మదిరంలో రాయరు, మూల, జయ, దిగ్విజయ, రాములకు సంస్థాన పూజ నిర్వహించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మండపంలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన బెట్ట వెంకటేష్ బృందం నాద తరంగిని, జుగల్‌బందీ చేపట్టారు. రాయచూరుకు చెందిన మంగళకలార్చన సంది నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
అనుగ్రహ ప్రశస్థి అవార్డులు
పలువురు ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేశారు. యోగీంద్ర మంటపంలో కాశి యూనివర్సిటీ రిటైర్డు వైస్ చాన్స్‌లర్, పండిట్ రాజారామ్ శుక్లా, కోయంబత్తూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ పీఆర్ విఠల్‌కు పీఠాధిపతి చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీధర్‌రావు, ఏఏవో మాధవశెట్టి అవార్డు గ్రహీతల బయోడేటా భక్తులకు పరిచయం చేశారు.
ఘనంగా పూర్వారాధన ఉత్సవాలు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు

సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు

సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు