వైఎస్సార్‌ సీపీలో పలువురి నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురి నియామకం

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన పలువురికి స్లేట్‌, జిల్లా స్థాయి పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా నందిగామ నియోజకవర్గానికి చెందిన జిల్లేపల్లి రంగారావును స్టేట్‌ లీగల్‌సెల్‌ అఫీషియల్‌ స్పోక్‌ పర్సన్‌గా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బి. బ్యూలారాణిని స్టేట్‌ ఎస్సీసెల్‌ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. కాగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన కొలుసు రమాదేవిని జిల్లా మహిళా విభాగం జనరల్‌ సెక్రటరీగా, మైలవరం నియోజకవర్గానికి చెందిన కలగడ్డ మనో హర్‌ను జిల్లా ఐటీ వింగ్‌ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement