ఇద్దరి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

● ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరి దుర్మరణం ● డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే ప్రమాదం

ఎ.కొండూరు: మండలంలోని కంభంపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు.. పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన బొల్లెపోగు నాగరాజు (40) తన ఆటోకు మరమ్మతులు చేయించేందుకు కంభంపాడులోని రోడ్డు పక్కన ఉన్న మెకానిక్‌ షెడ్‌కు వచ్చాడు. ఆటోను రోడ్డు పక్కనే నిలిపి గున్నచింతలపాడు గ్రామానికి చెందిన మెకానిక్‌ వాడపల్లి కుమార్‌బాబు (21) మరమ్మతులు చేపట్టాడు. ఇంతలో ఓ ట్రాలీ ఆటో అతి వేగంగా వచ్చి మరమ్మతుల్లో నిమగ్నమైన నాగ రాజు, కుమార్‌బాబును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరుకు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. నాగరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గంధం మహాలక్ష్ముడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement