వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆత్మీయ కలయిక

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

గన్నవరం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో కలిసి గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై న అనగాని రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. కూటమి కుట్రలను ఎదుర్కొని జెడ్పీటీసీగా గెలుపొందిన రవిని జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాట్రు శేషుకుమార్‌, విద్యార్థి విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు అనగాని సుందర చైతన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement