సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

సమన్వయంతో పనిచేయాలి

నాగాయలంకలో కలెక్టర్‌ డీకే బాలాజీ

నాగాయలంక: కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సెగ్మెంట్‌ల పోలింగ్‌ నిర్వహణ అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని, పోలింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశించారు. నాగాయలంకలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి పోలింగ్‌ సిబ్బందికి మెటీరియల్‌ పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. మండల ఆర్‌ఓ, తహసీల్దార్‌ సీహెచ్‌వీ ఆంజనేయప్రసాద్‌, ఏఆర్వో, ఎంపీడీఓ కె.ఎం.చంద్రశేఖర్‌ నుంచి పోలింగ్‌ సంబంధిత వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. పోలింగ్‌ సిబ్బందిని పలుకరించి పోలింగ్‌ నిర్వహణపై చిత్తశుద్ధితో పనిచేయాలని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించే బృందాలకు అవసరమైన మెటీరియల్‌ పంపిణీ ప్రక్రియ చేపట్టామన్నారు. నాగాయలంక మండలంలో 45పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది ఎన్నికల సామగ్రి స్వీకరించి సరి చూసుకుంటున్నారని, పరిశీలన పూర్తికాగానే సాయంత్రంలోగా వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా అధికారులు ఏర్పాటు చేశారన్నారు. మండలం పరిధిలో కొన్ని గ్రామాలు దీవుల్లో ఉన్నందున అక్కడికి పోలింగ్‌ మెటీరియల్‌, సిబ్బందిని పడవలలో తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement