జిల్లాలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 1,271 మంది, సెకండ్ ఇయర్‌లో 1,731 మంది చొప్పున 3,002 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి కృష్ణా నుంచి 22 మంది జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు ఈ నెల 12వ తేదీన కొత్త విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారు ఒక సంవత్సరం పాటు తిరిగి జూనియర్ కళాశాలల్లోనే ‘ఆన్ డ్యూటీ’ ప్రాతిపదికన బోధనా బాధ్యతలు నిర్వహిస్తారు. బదిలపై వెళ్లిన వారు ఇప్పటికే పాత స్థానాలకు వచ్చి యథావిధిగా పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల బోధనకు ఎలాంటి అంతరాయం లేదు.
– కె.సరళ కుమారి,
జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి


