భక్తితో ప్రణమిల్లి | - | Sakshi
Sakshi News home page

భక్తితో ప్రణమిల్లి

Jan 29 2026 10:10 AM | Updated on Jan 29 2026 10:10 AM

భక్తి

భక్తితో ప్రణమిల్లి

గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026 భక్తితో ప్రణమిల్లి వైభవంగా ప్రారంభమైన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల ● ప్రథమ సారె సమర్పించిన పోలీసు శాఖ ● పారుపూడి, నెరుసు వంశస్తుల ప్రత్యేక పూజలు ● మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు ● గండదీప హారతులతో స్వాగతం పలికిన భక్తులు డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సంప్రదాయం ప్రకారం..

న్యూస్‌రీల్‌

కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026
కల్పవల్లి..
వైభవంగా ప్రారంభమైన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల
● ప్రథమ సారె సమర్పించిన పోలీసు శాఖ ● పారుపూడి, నెరుసు వంశస్తుల ప్రత్యేక పూజలు ● మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు ● గండదీప హారతులతో స్వాగతం పలికిన భక్తులు

కంకిపాడు: మండలంలోని ఉప్పలూరులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ యుగంధర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వైద్యసేవల నాణ్యతపై ఆరా తీశారు.

పెనమలూరు: యనమలకుదురు రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆవిష్కరించారు.

ఉయ్యూరు: భక్తుల కల్పవల్లి, కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మెట్టినింటి నుంచి బయలెల్లిన అమ్మకు అశేష భక్తజనం హారతులతో భక్తిపూర్వక స్వాగతం పలికింది. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా వెలుగులు, దీపకాంతుల నడుమ.. పల్లకీలో శ్రీ కనక చింతయ్య సమేతంగా ఊరేగుతున్న తల్లికి అడుగడుగునా భక్తులు పసుపునీళ్లు ఓరబోసి ఎదురు గండ దీపాలు, తిరుగుడు గండ దీపాలతో హారతులు పట్టారు. పసుపు కుంకుమలు, సారె సమర్పించి తరించారు.

తొలుత పారుపూడి, నెరుసు వంశస్తులు ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంప్రదాయం ప్రకారం పోలీసుశాఖ ప్రథమ పసుపు కుంకుమ, సారెను శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లికి సమర్పించారు. పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటరెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, అధికారులతో కలిసి ఊరేగింపుగా మెట్టినింటికి చేరుకొని సారె సమర్పించారు. అనంతరం అమ్మవారికి మంత్రి పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ప్రత్యేక పూజలు జరిపించి, విగ్రహాలను మెట్టినింటి నుంచి వెలుపలకు మోసుకువచ్చి పల్లకీలో కూర్చుండబెట్టడంతో తిరునాళ్ల ఊరేగింపు ఆరంభమైంది. అమ్మవారు మెట్టినింటి నుంచి బయటకు రాగానే భక్తులు గండ దీపాలతో హారతులు పట్టి జేజేలు పలికారు. పల్లకీలో తొలిగా కరణం బజారుకు వెళ్లి రావిచెట్టు సెంటరు మీదుగా పట్టణ పురవీధుల్లో ఊరేగారు. కూడళ్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి.

7

బందోబస్తు ఏర్పాట్లు..

గన్నవరం డీఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు, సీఐ రామారావు, పోలీసు కుటుంబాలు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు అమ్మవారిని దర్శించుకుని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులకు అసౌకర్యం కలుగకుండా తిరునాళ్లను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 300 మంది సిబ్బందితో తిరునాళ్ల బందోబస్తు ఏర్పాటు చేశారు.

భక్తితో ప్రణమిల్లి 1
1/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 2
2/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 3
3/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 4
4/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 5
5/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 6
6/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 7
7/8

భక్తితో ప్రణమిల్లి

భక్తితో ప్రణమిల్లి 8
8/8

భక్తితో ప్రణమిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement