ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నీ జెర్సీ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చామల ఫౌండే షన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మార్చిలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 టోర్నీ జెర్సీని మంత్రులు ఎం.రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆవిష్కరించారు. ఎంజీ రోడ్డులోని హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా పొలిటికల్ కింగ్స్, టాలీవుడ్ టండర్స్, బుల్లితెర రేంజర్స్, మీడియా మాస్టర్స్, శిరి ఇన్ఫో మిస్సైల్స్, పోలీస్ లయన్స్ జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. క్రీడా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలైట్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ ఏపీలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైనిక సంక్షేమం కోసం సీజన్ –1ను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సీజన్–2లో పొలిటికల్ టీమ్ ఆడనున్నట్లు తెలిపారు. యువ మంత్రుల టీమ్ కచ్చితంగా కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్–2 ఆంధ్రాలో నిర్వహించడం ఆనందించే అంశమన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ నటుడు ప్రభాకర్, చామల ఫౌండేషన్ చైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి, వైస్ చైర్మన్ భాను చందర్‌రెడ్డి, డైరెక్టర్లు రవీందర్‌రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


