అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.12.44 లక్షలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానిక ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి రూ.12.44 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. దేవస్థానం కార్యాలయం ప్రాంగణంలో దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో స్వామి వారి హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.సురేష్ కుమార్ పర్యవేక్షణాధికారిగా హాజరయ్యారు. 85 రోజులకు రూ.12,44,579 ఆదాయం వచ్చిందని వివరించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, సభ్యులు మూల్పూరు గోపిచంద్, పాబ్రోలు లక్ష్మీప్రియ, అక్కప్రోలు సునీత, కొక్కిరపాటి రామచంద్రయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళా సాధికారత, సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో వర్ణిక ది ఫ్లో బజార్ పేరిట బంగారు, వజ్రాభరణాలు, వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ విజయవాడ చాప్టర్ చైర్ పర్సన్ అమ్రిత కుమార్ బుధవారం తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని కృష్ణలంక మెట్ల బజారులో నివసించే 120 నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు చదువుల నిమిత్తం విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హోటల్ వివంతలో సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో చాప్టర్ సీనియర్ చైర్ పర్సన్ సుప్రియ మలినేని, దీప్తి చలసాని, కోశాధికారి దేవినేని తులజా భవాని, దుర్గా సౌజన్య పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. 49 రోజులకు రూ.22,34,097 నగదు సమకూరింది. 150 మిల్లీగ్రాముల బంగారం, 82 గ్రాముల వెండి, విదేశీ నగదు 31 డాలర్లు వచ్చాయి. మచిలీపట్నంలోని శ్రీ భద్రాద్రి రామాలయం ఈఓ శిరీష పర్యవేక్షణలో కొండలమ్మ దేవస్థానం చైర్మన్ ఈడే వెంకటవిష్ణు మోహన్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనే యులు, మన్నెం వీర నాగేంద్రరావు, ఈఓ ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు.
కోనేరుసెంటర్(మచిలీపట్న): కృష్ణా జిల్లాలో మరో 11 బార్ అండ్ రెస్టారెంట్‌లకు ఎకై ్సజ్ అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో లేదా మచిలీపట్నం ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో స్వయంగా హైబ్రిడ్‌మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలని మచిలీపట్నం ఎకై ్సస్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు రూ.5 లక్షల ఫీజు రూ.10 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఫిబ్రవరి నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాలని స్పష్టంచేశారు. ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామన్నారు. లాటరీలో బార్‌లు దక్కించుకున్న లైసెన్స్‌దారులు వెంటనే 1/6 లైసెన్స్ ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. ప్రతి బారుకు కనీసం నాలుగు దరఖాస్తులు అందితేనే లాటరీ తీస్తామన్నారు. లైసెన్స్ ఫీజుతో పాటు ఇతర వివరాల కోసం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (99636 04239), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (84669 81837)ను సంప్రదించాలని సూచించారు.
అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.12.44 లక్షలు


