తిరుమలలో దుర్గగుడి అధికారుల పర్యటన
విజయవాడ కల్చరల్: నేటి సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం కృష్ణానదిపై బోధిసిరి బోటుపై కృష్ణాతీరం– కవితా విహారం పేరుతో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ముఖ్యంగా సరికొత్తగా రూపాంతరం చెందుతున్న నేటి నైరూప్య కవిత్వాన్ని (యాబ్ స్ట్రోక్ పోయిట్రీ) భద్రపరచాల్సిన అవసరముందన్నారు. మల్లెతీగ సాహిత్యవేదిక అధ్యక్షు డు కలిమిశ్రీ మాట్లాడుతూ 50 మంది కవులతో వినూత్న రీతుల్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందన్నారు.
కంకిపాడు: పంట నమోదు వేగంగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి ఆదేశించారు. మండలంలోని పునాదిపాడులో పంట నమోదు ప్రక్రియను బుధవారం పరిశీలించారు. పద్మావతి మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా తమ పంట వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఆర్‌ఎస్‌కే సిబ్బందికి తమ వివరాలను అందజేయాలన్నా రు. రైతులు ఏపీ ఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్ ద్వారా వాతావరణ వివరాలను, పంటలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నారు. పంట నమోదు ప్రక్రియలో జాప్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధికారి ఉషారాణి, బాబూరావు, ఏఈఓ షరీఫ్ పాల్గొన్నారు.
విజయవాడ కల్చరల్: కథా సాహిత్యంలో సమా జ చిత్రీకరణ కనిపించాలని పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు అన్నారు. సమన్విత, కోపూరి ట్రస్ట్, కామ్రేడ్ జీఆర్‌కే పోలవరపు సాహితీ సమితి ఆధ్వర్యంలో బందరురోడ్డులోని బాలోత్సవ్ భవన్‌లో బుధ వారం అదే ప్రేమ, అస్మిత పుస్తకాల పరిచయం, ఆవిష్కరణ నిర్వహించారు. నారాయణరావు మాట్లాడుతూ అదే ప్రేమ కథల సంకలనంలో అనేక వాస్తవ జీవితాలు కనిపిస్తాయన్నారు. విశ్రాంత ఆకాశవాణి సంచాలకురాలు ముంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలు తమ వాదనను బలంగా వినిపిస్తు న్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పి.సత్యవతి మాట్లాడుతూ సమకాలీన సమాజానికి అద్దం పట్టే కథలు రావాలన్నా రు. సమన్విత కార్యవర్గ సభ్యులు వడ్లమూడి పద్మావతి, కోపూరి పుష్పాదేవి, దుట్టా శమంతక మణి కథల సంకలనంలోని విశేషాలను వివరించారు.
తిరుమలలో దుర్గగుడి అధికారుల పర్యటన


