దుర్గమ్మ సేవలో ఎంపీ శివనాథ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన ఎంపీకి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు, అర్చకులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితుడు కొమ్మూరి ఫణి కుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వ నాథ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో సోమ వారం రాత్రి ప్రత్యేక పల్లకీలో స్వామివార్ల ద్వాదశ ప్రదక్షిణలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి పుష్పశయ్యాలంకృత పర్యంకసేవను శాస్త్రోక్తంగా జరిపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
పెనమలూరు: జేఎన్‌టీయుకే ఇంటర్ కాలేజీ సెంట్రల్ జోన్ సీ్త్ర, పురుషుల ఆటల పోటీలను పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివాజీబాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా శివాజీబాబు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. జేఎన్‌టీయుకే ఇంటర్‌కాలేజీ టోర్నమెంట్ల కార్యదర్శి డాక్టర్ జి.పి.రాజు మాట్లాడుతూ.. నెట్‌బాల్, చెస్ పోటీల్లో 40 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. రెండు రోజుల పాటు పోటీలు జరిగిన తరువాత జట్లను ఎంపిక చేస్తామన్నారు. పీడీ సాంబశివరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉయ్యూరు: శ్రీ పారుపూడి కనక చింతయ్య సమేత వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ హేలాషారోన్ సూచించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవంపై వివిధ శాఖల అధికారులు, ఆలయ ప్రతినిధులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ హేలా షారోన్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలన్నారు. టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, తహసీల్దార్ సురేష్‌కుఆర్, సీఐ టి.వి.వి.రామారావు, ఎస్‌ఐ మల్లికాసులు, పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో ఎంపీ శివనాథ్
దుర్గమ్మ సేవలో ఎంపీ శివనాథ్
దుర్గమ్మ సేవలో ఎంపీ శివనాథ్


