జీఎం సేఫ్టీ అవార్డులు
ఇద్దరు డివిజన్ ఉద్యోగులకు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డులొచ్చాయి. మంగళవారం సికింద్రాబాద్, రైల్ నిలయం నుంచి జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ ఏడీఆర్‌ఎం పి.ఇ.ఎడ్విన్, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్‌గా భద్రతపై సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా జోన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన స్టేషన్ మాస్టర్లు, లోకో పైలెట్‌లు, పాయింట్ మెన్లు, కీమ్యాన్ తదతర విభాగాల ఉద్యోగులకు జీఎం అవా ర్డులను అందజేశారు. విజయవాడ డివిజన్ ఆపరే టింగ్ విభాగంలోని రాపర్ల స్టేషన్ మాస్టర్ పెద్దిబోయిన హరీష్, ఎలమంచిలి స్టేషన్ మాస్టర్ పి.అశోక్‌కు జీఎం అవార్డులు అందజేసి అభినందనలు తెలిపారు.
విజయవాడ డివిజన్‌కు మొదటి ర్యాంకు
సమయపాలనలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నంబర్ వన్ ర్యాంకు సాధించింది. జనవరి 26న విజయవాడ డివిజన్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలనలో ఇతర డివిజన్‌ల కంటే 94.97 శాతం అత్యత్తమ సమయపాలన సాధించింది. ఇది మొత్తం దక్షిణ మధ్య రైల్వే సగటు 87.36శాతం కంటే ఎక్కువ. డివిజన్‌లో షెడ్యూల్ చేసిన 179 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 170 రైళ్లు షెడ్యూల్ సమయానికే చేరుకున్నాయి. ఇది కచ్చితమైన రైలు కార్యకలాపాలు, ప్రభావవంతమైన సమయ పర్యవేక్షణ, అన్ని విభాగాల సమన్వయ ప్రయత్నాలకు నిదర్శనంగా నిలిచినట్లు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.


