
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుడివాడరూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ మెహబూబ్ షరీఫ్ శుక్రవారం తెలిపారు. గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని దోసపాడు–ఇందుపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్యలో గుర్తు తెలియని రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. ఎస్‌ఎల్‌సీ అనే కంపెనీలో పని చేస్తున్నట్లు, అతని పేరు కృష్ణమూర్తి అని ఐడీ కార్డు మృతుని జేబులో దొరికిందన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సెల్: 9440627570లో సంప్ర దించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ మెహబూబ్ తెలిపారు.