
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు ప్రజలూ పాటుపడాలని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, యువతను మత్తు పదార్థాల జోలికి పోకుండా పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. యువత జీవితాలను చిత్తు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
ఎస్పీ గంగాధరరావు