వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

Aug 12 2025 11:42 AM | Updated on Aug 12 2025 11:42 AM

వేర్వ

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

ఆత్కూరు(గన్నవరం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పెద్దఆవుటపల్లి గ్రామ శివారు లూర్థునగర్‌కు చెందిన దొప్పల సురేష్‌(39) రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటిలో సురేష్‌ ఉరి వేసుకుని ఉండటాన్ని అతని భార్య గమనించింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో అతడిని కిందకు దింపి చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్‌ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

గుడివాడలో వ్యక్తి మృతి

గుడివాడరూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని నీలామహాల్‌ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీలామహాల్‌రోడ్డులో నివాసముంటున్న పోలుకొండ భద్రయ్య(48) ఆదివారం జరిగిన గంగానమ్మ సంబరంలో పాల్గొని మద్యం సేవించాడన్నారు. రోజు మాదిరిగానే రాత్రి ఇంట్లో పడుకున్న భద్రయ్య తెల్లారి సోమవారం చూసే సరికి చనిపోయి ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్‌ సీఐ కొండపల్లి శ్రీనివాస్‌, తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పిన్ని కుమారుడు వల్లూరు రాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఓ స్థలం విషయమై మృతునికి, అతని బంధువులకు గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రెండు సార్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడిది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

తల్లి చెంతకు చేరిన బాలుడు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటి నుంచి తల్లితో పాటు బయలుదేరి, బస్టాండ్‌లో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని మహిళా పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన సోమవారం విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహిళా కానిస్టేబుళ్లు ఎస్‌కేబీబీ శైలజ, అనూష సోమవారం పీఎన్‌బీఎస్‌లో శక్తి యాప్‌పై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని వారు గుర్తించి అతని వద్దకు వెళ్లి వివరాలు అడగా, తల్లి పేరు మాత్రమే చెబుతూ, అడ్రస్‌ చెప్పలేక పోతున్నారు. దీంతో చుట్టుపక్కల విచారించినా ఎవరూ తెలియదని చెప్పడంతో, బాలుడిని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఇన్‌స్పెక్టర్‌ వాసవి బాలుడిని వివరాలు అడుగుతూ ఎక్కడకి వచ్చారని అడగ్గా హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలపడంతో పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి విచారించారు. దీంతో అక్కడ తల్లి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడిని క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి పోలీసులకు వివరాలు చెబుతూ, తనది చిట్టినగర్‌ అని, భర్త మృతి చెందగా, తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పిల్లల్లో ఇద్దరికి అనారోగ్యం కారణంగా పాత ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తున్న క్రమంలో రెండో బాబు కనిపించక పోవడంతో చుట్టుపక్కల విచారించి ఏమి చేయాలో తెలియని సమయంలో మహిళా పోలీసులు, శక్తి బృందం బాలుడిని తీసుకువచ్చి అప్పగించారన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు బాలుడి తల్లి అభినందనలు తెలిపింది.

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి  1
1/2

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి  2
2/2

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement