
భారీ వర్షానికి పొంగిన వాగులు
పెనుగంచిప్రోలు: మండలంతో పాటు ఎగువన ఆదివారం రాత్రి భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు లింగగూడెం వద్ద గండివాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కన ఉన్న పొలాలు మొత్తం నీట మునిగాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పొలాలపై వరద ప్రవహించటంతో పాటు పంటలు పూర్తిగా నాశనమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముండ్లపాడు గ్రామంలోని వాగు చప్టాపై వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగులు గుండా నీరు ఉధృతంగా ప్రవహించటంతో సమీప వరి పొలాలు నీట మునిగాయి.
రాకపోకలకు అంతరాయం

భారీ వర్షానికి పొంగిన వాగులు