
ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశాలు 9, 10 తేదీల్లో కొండపల్లిలో జరిగాయన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు చేయడంతో పాటు నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా టి.కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు స్కిల్స్ పెంచడానికి విజయవాడ కేంద్రంగా సైన్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్–కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీ అనంతరం నూతన జిల్లా కమిటీని 21 మందితో ఎన్నుకున్నామన్నారు.
నూతన కార్యవర్గం..
నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా టి.కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రణయ్, టి.కుమార్ నాయక్, టి.ప్రణీత, ఎస్‌కే ఖాజు, సహాయ కార్యదర్శులుగా బి.మాధవ్, వి.షణ్ముఖ, కె.యశస్వినీ దేవి, పెద్దబాబు, జిల్లా కమిటీ సభ్యులుగా ప్రసాద్, ఒజెస్విన్, జ్వాలిత, మోహన్‌కృష్ణ, కావ్య, కుషాల్ కుమార్, నరసింహ, సిద్దు, హస్మి, యశ్వంతీ ఉన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం