
అక్షరం ప్రభాకర్ ‘రణం’ ఉత్తమ కవితగా ఎన్నిక
విజయవాడ కల్చరల్: ఎక్స్‌రే సాహిత్య మాసపత్రిక జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు కవితల పోటీ విజేతలను ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, అధ్యక్షుడు కొల్లూరి ఆదివారం ప్రకటించారు. తెలంగాణ మానుకోటకు చెందిన అక్షరం ప్రభాకర్ రచించిన రణం కవితను ఉత్తమ కవితగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు బహుమతి ఎక్స్‌రే అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. కె.మునిసురేష్ పిళ్లే హైదరాబాద్, మామిడిశెట్టి శ్రీనివాస్ దొడిపట్ల, డాక్టర్ రాధాశ్రీ నాగరం, అవ్వారు శ్రీధర్‌బాబు నెల్లూరు, చిత్రాడ కిషోర్‌కుమార్ విజయవాడ, జాగారపు శంకరరావు గజపతి నగరం, శ్రీ కంఠస్ఫూర్తి విజయవాడ, దుప్పటి రమేష్‌బాబు నెల్లూరు, ధవశ్వేరపు రవికుమార్ విశాఖపట్నం, కోరుప్రోలు హరినాథ్ హైదరాబాద్ ఎక్స్‌రే అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరంలో విజయవాడలో జరిగే సభలో వారికి నగదు బహుమతి, జ్ఞాపికలతో సత్కరిస్తామని పేర్కొన్నారు.