రామలింగేశ్వరునికి జాజులతో మహార్చన | - | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరునికి జాజులతో మహార్చన

Aug 11 2025 7:35 AM | Updated on Aug 11 2025 7:37 AM

నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో ఆదివారం రాత్రి స్వామివారి శివలింగానికి 25 కేజీల సన్నజాజి, విరజాజి పువ్వులతో మహార్చన వైభవంగా జరిపారు. బ్రహశ్రీ అంబా సాయికిరణ్‌ శర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన జాజులతో వేద పండితులచే అర్చన నిర్వహించారు. తదుపరి భక్తులు బారులుతీరి జాజి పూలతో స్వామిని వారే స్వయంగా అభిషేకించారు. అనంతరం అభిషేక పూజ, అలంకరణను శర్మ శోభాయమానంగా తీర్చిదిద్దారు. క్షేత్రం కమిటీ చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు, నిర్వహణకర్త తలశిల రఘుశేఖర్‌, ఉప్పల లీలాకృష్ణప్రసాద్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకులు

వెంకటాపురం(పెనుగంచిప్రోలు): మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందిమాల సత్యనారాయణ, నల్లబోతుల రామకృష్ణ(బుల్లబ్బాయి) వారి కుటుంబ సభ్యులు శఽనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, సర్పంచ్‌ కూచి నర్సయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

లేజర్‌ ఎన్యుక్లియేషన్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రొస్టేట్‌ సర్జరీలపై శిక్షణ

పటమట(విజయవాడతూర్పు): ప్రశాంత్‌ హాస్పిటల్‌ 37వ వార్షికోత్సవం సందర్భంగా లేజర్‌ ఎన్యుక్లియేషన్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రొస్టేట్‌ సర్జరీ ప్రోగ్రామ్‌(లీప్‌)ను అత్యాధునిక ప్రొస్టేట్‌ సర్జరీలు, వైద్య చికిత్సల నిర్వహణపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్బీపేటలోని ప్రశాంత్‌ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో అడ్వాన్స్‌డ్‌ లేజర్‌ ఎన్యుక్లియేషన్‌ ప్రొస్టేట్‌ చికిత్స గురించి, లైవ్‌ సర్జరీలు, చికిత్సలో మెలకువలు, యూరాలజిస్టులకు ప్రయోగాత్మక శిక్షణ అందించారు. వాటితో పాటు రెజుమ్‌ వాటర్‌ వేపర్‌ థెరపీ వంటి సూక్ష్మ విధాన శస్త్రచికిత్సలు, యూరోలిఫ్ట్‌, రోబోటిక్‌ సింపుల్‌ ప్రొస్టటెక్టమీ, తదితర చికిత్స విధానాలపై శిక్షణనందించారు. ప్రశాంత్‌ హాస్పిటల్‌ ఎండీ, కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ధీరజ్‌ కాసరనేని, క్లినికల్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామలింగేశ్వరునికి జాజులతో మహార్చన 
1
1/1

రామలింగేశ్వరునికి జాజులతో మహార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement