
మెడికల్ టెక్నీషియన్ల హక్కుల సాధనకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ హక్కుల సాధనకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ ఆదివారం జరిగింది. సభకు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను మల్లాది విష్ణుకు తెలియజేశారు.
బీమా సదుపాయం కూడా లేని పరిస్థితి
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్‌లదే కీలక పాత్ర అన్నారు. వారి సేవలను ప్రశంసించారు. రేడియాలజీ టెక్నీషియన్స్,ల్యాబ్ అసిస్టెంట్స్ ప్రభుత్వ సహాయ, సహకారాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం బీమా సదుపాయం కూడా లేదన్నారు. తాము అధికారంలో లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు