
దుర్గమ్మకు పలువురి విరాళా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధి కారులకు అందజేశారు. గుంటూరు పాత పట్టాభిపురానికి చెందిన విజయ్ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని ఇచ్చారు. డోనర్ సెల్‌కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన బాలాప్రగడ ఎన్‌ఎస్. కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది. దాతలకు దుర్గమ్మ దర్శనం కల్పించిన అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు ఇచ్చారు.
రాము, హారిక దంపతులకు పరామర్శ
పెడన: వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్ల మెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఆదివారం వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక దంపతులను పరామర్శిం చారు. గత నెల 12న గుడివాడలో హారిక, రాము దంపతులపై దాడి జరిగింది. ఆదివారం పెడన మండలం కూడూరులోని రాము నివాసానికి చేరుకుని రాము దంపతులను పరామర్శించి దాడి ఘటనను అడిగి తెలుసుకున్నారు. దాడులు దారుణమని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులున్నారు.
నేటి నుంచి ఇన్విటేషనల్ వాలీబాల్ టోర్నమెంట్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): నగరంలో పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలోని మైదానంలో నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ వాలీబాల్ (సీ్త్ర, పురుషులు) టోర్నమెంట్ జరగనుంది. దీనిలో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ జట్లు తలపడ నున్నాయి. అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఇప్పటికే టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు నగరానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం టోర్న మెంట్ ప్రారంభ సభ జరుగుతుంది. తమ అకాడమీ స్వర్ణోత్సవం సందర్భంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు.
తక్కెళ్లపాడులో తెలంగాణ ఉన్నతాధికారులు
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): తక్కెళ్లపాడులో తెలంగాణ ఉన్నతాధికారులు ఆదివారం పర్యటించారు. గ్రామానికి చెందిన ప్రస్తుత తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ దారావత్ జానకి పర్యటించారు. ఈ ప్రాంతంలో పుట్టి పురిగి ఇతర ప్రాంతాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న వారిని ఆదివారం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కస్కుర్తి శ్రీనివాసరావు, కోదాడకు చెందిన వ్యాపార వేత్త పెదనాటి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్పీ గెంటేల సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు పలువురి విరాళా

దుర్గమ్మకు పలువురి విరాళా

దుర్గమ్మకు పలువురి విరాళా