
పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడకం
నాకు వచ్చిన ఆలోచన మేరకు 365 రోజులు ఏదో ఒక పంట ద్వారా ఆదాయం పొందవచ్చని విభిన్న రకాల పండ్ల మొక్కలు నాటాను. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలోనే మొక్కలు పెంచాను. ఫలసాయం కూడా బాగానే ఉంది. డ్రాగన్, అంజీర పండ్లు సొంతంగా అమ్ముతున్నాం. నిమ్మతో పాటు జామ పిందె దశలో ఉన్నాయి. నిమ్మ కొన్ని మొక్కలు కోతకు కూడా వచ్చాయి. పూర్తిగా డ్రిప్ ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నాం. మొక్కలు పెద్దవి కావడంతో అంతర పంటల సాగు కూడా లాభదాయకంగా ఉంటుంది. రైతులు నూతన సాగు పద్ధతులతో ముందుకు వెళ్లాలి. ముందు మా కుటుంబంలో కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి పండ్లను తినడంతో పాటు విక్రయంతో ఆదాయం పొందవచ్చు.
– గింజుపల్లి శ్రీనివాసరావు, రైతు, పెనుగంచిప్రోలు