
హర్ ఘర్ తిరంగ ప్రచార ర్యాలీ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ’ ప్రచార ర్యాలీ గురవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే నిర్మాణంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. డివిజన్ పరిధిలోని స్టేషన్‌లు, కార్యాలయాలు, సూల్స్‌లో జాతీయ జెండాలను ప్రదర్శించేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రచారంలో భాగంగా కమర్షియల్ విభాగం వారు విజయవాడ రైల్వేస్టేషన్, డీఆర్‌ఎం కార్యాలయాలలో సెల్ఫీ బూత్‌లను సృజనాత్మకంగా ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం డివిజన్ ఆడిటోరియంలో జరిగిన పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 300 మంది జాక్ అండ్ జిల్, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలతో అందరినీ ఉత్తేజపరిచారు.