
వివాహిత ఆత్మహత్య
కృత్తివెన్ను: మండలంలోని మాట్లాం గ్రామానికి చెందిన వివాహిత ఒడుగు స్వాతి (24) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బుధవారం కేసు నమో దైంది. ఎస్‌ఐ పైడిబాబు కథనం మేరకు.. మాట్లాం గ్రామానికి చెందిన స్వాతికి కృత్తివెన్ను పల్లెపాలెంనకు చెందిన ఒడుగు కుమారస్వామితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి సంతానం లేకపోవడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తు న్నారని కొన్ని నెలల క్రితం స్వాతి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి రెండు నెలల నుంచి కుమారస్వామి, స్వాతి మాట్లాం గ్రామంలోనే నివసిస్తున్నారు. ఈ నెల ఐదో తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన స్వాతి చీరతో ఉరివేసుకున్నట్లు ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సోమేశ్వరరావు శవపంచనామా నిర్వహించారు.