
జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మంగళగిరి టౌన్: విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నగర పరిధిలోని ఆత్మకూరు బైపాస్‌లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేగాయి. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసేందుకు ఉపయోగించే లారీగా దీనిని గుర్తించారు. రహదారి పక్కనే ఆపిన లారీలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న నాలుగు సిలిండర్లు పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. పేలుడు శబ్దం ధాటికి సమీ పంలో ఉన్న ప్రజలు, వాహన దారులు భయ భ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరు కుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగే సమయంలో భారీగా ట్రాఫిక్ ఆగిపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసులు వచ్చి క్రమబద్ధీకరించారు.
అక్కాచెల్లెళ్లు అదృశ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన భవానీపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం ఔట్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్వాతి సెంటర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు వాళ్ల అమ్మ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో వారికి నెల్లూరుకు చెందిన యువకులు చందు, కృష్ణ ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయ మయ్యారు. వారితో అక్కచెల్లెళ్లు మాట్లాడు తుంటే తల్లి గమనించిన బాలికలను మంద లించింది. దీంతో బుధవారం ఉదయం అక్కా చెల్లెళ్లు ఇద్దరు కలిసి బయట టిఫిన్ చేసి వస్తామని చెప్పి తల్లి సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. సాయంత్రం వరకు చూసినా తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వారిని, తెలిసిన స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో తన ఇద్దరు కూతుళ్లు కనిపించడం లేదంటూ తల్లి భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.