బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి

Aug 6 2025 7:08 AM | Updated on Aug 6 2025 7:10 AM

ఓఓఏ ప్రతినిధులతో మంత్రి కొల్లు

మచిలీపట్నంటౌన్‌: అవకాశాలను అందిపుచ్చుకుని మచిలీపట్నంను అభివృద్ధి, ఉపాధికి కేంద్రంగా మారుస్తానని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓఓఏ సంస్థ ప్రతినిధులు, పోలెండ్‌ దేశానికి చెందిన పెట్టుబడిదారులు మంగళవారం మంత్రి కొల్లు రవీంద్రను స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు. పోర్టు సమీపంలో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. మచిలీపట్నం పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. పోర్టు సమీపంలో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన రవాణా అత్యంత సులభతరం అవుతుందన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

కంకిపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్‌ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని పులి రామారావు నగర్‌కు చెందిన బొల్ల కృష్ణ (60) రిక్షా కార్మికుడు. రోజూ మాదిరిగానే మంగళవారం కంకిపాడు బస్టాండు ప్రాంతానికి వచ్చాడు. మూత్ర విసర్జనకు బస్టాండు ప్రాంగణానికి వెళ్లిన కృష్ణను బస్టాండులోకి వచ్చిన సిటీ బస్సు రివర్స్‌ చేస్తున్న క్రమంలో వేగంగా ఢీకొంది. దీంతో బస్సు కింద పడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మూలపాడు గ్రామానికి చెందిన దొప్పా చంద్రశేఖర్‌ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మూలపాడులో నక్కా వెంకటరావు కుటుంబం నివాసం ఉంటోంది. వెంకటరావుతో పాటు మేనల్లుడు చంద్రశేఖర్‌ కూడా మూలపాడులోనే ఉంటాడు. చంద్రశేఖర్‌ 2019లో పదో తరగతి పరీక్షలు రాయగా.. ఫెయిల్‌ అయ్యాడు. అయితే ఈ ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణత కావడంతో ఐటీఐ చదివించేందుకు నిర్ణయించుకున్నాడు. సోమవారం ఉదయం చంద్రశేఖర్‌ సర్టిఫికెట్స్‌ తీసుకుని తన స్నేహితుడి బైక్‌పై నగరంలో ఐటీఐ కాలేజీ అడ్మిషన్‌ కోసం వచ్చాడు. అడ్మిషన్‌ పని పూర్తి కావడంతో పాయకాపురంలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి చీకటి పడే వరకు అక్కడే ఉన్నాడు.

తిరిగి ఇంటికి వస్తుండగా..

రాత్రి బైక్‌పై తిరిగి ఇంటికి బయలుదేరి వస్తుండగా, వెస్ట్‌ బైపాస్‌పై జక్కంపూడి పంచాయతీ పరిధిలోకి వచ్చే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో చంద్రశేఖర్‌ రోడ్డుపై పడటంతో తలకు, ఎడమ కాలికి బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహన చోదకులు యువకుడు పడి ఉండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదస్థలానికి చేరుకున్న మేనమామ, తల్లి కుమారి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి 
1
1/3

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి 
2
2/3

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి 
3
3/3

బందరులో గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement