
పాలనలో మహిళల భాగస్వామ్యం అవసరం
చిలకలపూడి(మచిలీపట్నం): పరిపాలనలో మహిళల భాగస్వామ్యం అవసరమని జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జెడ్పీ సమావేశపు హాలులో ‘మహిళా సాధికారత – స్వపరిపాలన సాధ్యం’ అంశంపై మహిళా ప్రజాప్రతినిధులకు మూడు రోజుల శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబే డ్కర్ ఆశయ స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎంతో మంది మహిళ లను ప్రజాప్రతినిధులను చేశారని గుర్తుచేశారు. పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం ఉండా లని ఆలోచన చేశారన్నారు. స్థానిక సంస్థల పరిపాలనలో మహిళల పాత్ర ముఖ్యమైనదని సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్మన్లు ఎంతో సమర్థవంతమైన పరిపాలన చేస్తున్నారన్నారు. తొలుత గాంధీజీ, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనందకుమార్, కోడూరు ఎంపీడీఓ జి.సుధాప్రవీణ్, అశోక్‌కుమార్, కిరణ్మయి పాల్గొన్నారు.
మన మిత్ర యాప్‌పై అవగాహన కల్పించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డిజిటల్ సేవల్లో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర యాప్) పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మనమిత్ర యాప్‌పై సచివాలయ అధికారులు, సిబ్బందితో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కీయ బందర్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. మనమిత్ర – వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి షటిల్ పోటీలు
గన్నవరం: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన స్థానిక కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి షటిల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కే ఝాన్సీలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడా పితామహుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన 19 ఏళ్లలోపు బాల, బాలికలు ఆధార్‌కార్డు, పదో తరగతి సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు. ఎంట్రీల నమోదుకు 98850 68099 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.
విద్యాశక్తి కార్యక్రమాన్నిబహిష్కరించిన ఫ్యాప్టో
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఫ్యోప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సుందరయ్య, డాక్టర్ ఇంటి రాజు తెలిపారు. ఈ మేరకు డీఈఓ యు.వి.సుబ్బారావును ఆయన కార్యాలయంలో కలిసి మంగళవారం వినతిపతం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాశక్తి కార్యక్రమం పేరుతో ప్రభుత్వం జూలై వరకు షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. జిల్లా అధికారులు 2026 మార్చి వరకు షెడ్యూల్ ఇచ్చి బలవంతంగా జరపడాన్నీ ఖండించారు. ఉన్నత పాఠశాలల్లో విద్యాశాఖ నిర్వహిస్తున్న విద్యాశక్తి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేయాలని విధి విధానాలు ఉన్నాయని, అయితే అకడమిక్ మానిటరింగ్ అధికారులు నిర్బంధంగా చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్ సయ్యద్ ఖాసీం, నాయకులు సదారతుల్లా బేగ్, వి.రాధిక, నయూం, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

పాలనలో మహిళల భాగస్వామ్యం అవసరం

పాలనలో మహిళల భాగస్వామ్యం అవసరం