
ఐపీఎస్‌కు ఎంపికై న దోనేపూడి విజయ్‌బాబు
తెనాలి: పట్టణానికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్‌లను కేటాయిస్తూ యూపీఎస్‌ఈ మంగళవారం తుది ఫలితాలను విడుదల చేసింది. 2021 సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన విజయ్‌బాబు, ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్) బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావాలన్న లక్ష్యం కోసం వరుసగా సివిల్స్ పరీక్షలురాస్తూ వచ్చారు. నాలుగో పర్యాయం 681 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు సంతృప్తి లేదన్నారు. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి అయిన తన తండ్రి దోనేపూడి మధుబాబు కోరిక ప్రకారం ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన కలగా విజయ్‌బాబు చెప్పారు. అందు కోసం మరోసారి సివిల్స్ రాస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా విధుల నిర్వహణ నాలుగో పర్యాయం సివిల్స్ రాసిఐపీఎస్‌కు ఎంపిక