
రైతు బజారుల్లో కూరగాయల ధరల బోర్డులు పెట్టాలి
జగ్గయ్యపేట అర్బన్: వినియోగదారుల సౌకర్యార్థ్యం రైతు బజార్లలో కూరగాయల ధరల బోర్డులు ఏర్పా టుచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సూచించారు. మంగళవారం పట్టణంలోని రైతుబజారును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించారు. తూనికల్లో తేడాలు లేకుండా చూడాలని ఎస్టేట్ ఆఫీసర్ వెంకటరమణను ఆదేశించారు. బలుసుపాడు రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. స్టోర్‌లో బియ్యం, కంది పప్పు తదితర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. ఆర్డీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మనోహర్, ఆర్‌ఐ సూర్యకుమారి, ప్రిన్సిపాల్ కె.లక్ష్మీసుజాత, అధ్యాపకులు పి.కరుణ పాల్గొన్నారు.