
సానుకూలంగా పరిశీలించి పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, మెప్మా పీడీ సాయిబాబు, ఆర్డీవో స్వాతి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ఆర్టీజీ వెబ్‌సైట్‌లో సర్క్యులర్లు, ఉత్తర్వులు అప్‌లోడ్ చేయాలన్నారు. మీ కోసంలో అధికారులు 152 అర్జీలను స్వీకరించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం వాల్‌పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా ఇచ్చే అల్బెండజోల్ మాత్రలు వేసి నులిపురుగుల నివారణకు కృషి చేయాలన్నారు.
మీ కోసంలో 152 అర్జీలు స్వీకరణ
డీఆర్వో చంద్రశేఖరరావు