
బిల్డింగ్ పైనుంచి పడి పెయింటర్ మృతి
కోనేరుసెంటర్: ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ పెయింటర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై సోమవారం కేసు నమోదు చేసిన ఆర్ పేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెడనకు చెందిన బత్తు వెంకటస్వామి (40) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. రోజులానే సోమవారం మచిలీపట్నంలో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. నాలుగో అంతస్తులో తాడు సహాయంతో పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడిపోయాడు. ఈ ఘటనలో వెంకటస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య కువైట్‌లో ఉండగా.. ఇరువురు కుమార్తెల్లో పెద్దమ్మాయికి వివాహం అయ్యింది. రెండో కుమార్తె ఉద్యోగం చేస్తుంది.