
కృష్ణాజిల్లా
నేడు ‘మీ కోసం’
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం తెలిపారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు.
పర్యాటకుల సందడి
కృష్ణమ్మ ఉరకలు పెడుతుండటంతో పర్యాటకులు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఘాట్ల వద్ద కూర్చొని సేదదీరారు.
కొండలమ్మకు వెండి కిరీటం
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారికి కాకినాడకు చెందిన పిల్లి శ్రీనివాసులు, సంధ్య, విహిత ఆదివారం రూ.1.40లక్షల విలువ గల వెండి కిరీటాన్ని సమర్పించారు.
● కోడూరు మండలం పిట్టల్లంకలో వాటర్ ట్యాంకు నుంచి భావిశెట్టివారిపాలెం వరకూ వెళ్లే పంటబోదుని రూ.25వేలు చందాలు వేసుకుని రైతులు ఇటీవలె పూడిక తీయించుకున్నారు. అయినా ఈ బోదుకు నీరక్కెడం లేదు. ఈ పంటబోదు కింద పోసిన నారుమళ్లను బతికించుకునేందుకు ఇక్కడి రైతులు గుల్లపంపు, ఇంజిన్లతో ప్రతిరోజూ నీరు తోడుకుంటున్నారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి నీరు వదలడం పట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు.
బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్‌లో సీపీఎం రైతు సంఘం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు చెందిన రైతులు సాగునీటి కోసం ధర్నా చేశారు. బంటుమిల్లి ప్రధాన పంటకాలువతో పాటు అనుబంధ కాలువలకు పదిరోజుల నుంచి సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు చెప్పారు. కృష్ణానదికి వందలాది క్యూసెక్కులు సాగునీరు వృథాగా వదులుతున్నారని, పంటకాలువలకు పూర్తిస్థాయిలో ఎందుకు వదలడం లేదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు ప్రశ్నించారు.
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా