
స్పందనలో బాధితుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఏడీసీపీ వెంకటరత్నం
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాల మేరకు అడిషనల్ డెప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రై మ్స్) పి.వెంకటరత్నం సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన బాధితులతో మాట్లాడటంతో పాటు దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల నుంచి 68 ఫిర్యాదులు రావటంతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ లకు సత్వరమే చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదుల్లో 16 నగదు లావాదేవీలు, 5 భార్యాభర్తలు, 16 సివిల్ వివాదాలు, 15 వివిధ మోసాలకు సంబంధించినవి, ఒకటి ఇంటి అద్దెకు సంబంధించి, ఒకటి దొంగతనం, ఒకటి త్వరిత గతిన పరిష్కరించాల్సిన కేసు, ఇతర చిన్న చిన్న వివాదాలు, సమస్యలకు సంబంధించిన 13 ఫిర్యాదులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment