రెబ్బెన: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. నవేగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతోపాటు, జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. వివిధ తరగతుల విద్యార్థుల పఠన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తోటివారితో పోటీ పడేలా చూడాలన్నారు. ఆయన వెంట ఎంఈవో వెంకటేశ్వర్లు, ఏఎంవో శ్రీనివాస్ ఉన్నారు.


