ఆసిఫాబాద్అర్బన్: దేశంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీఆర్వో దాసరి వేణు, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్ మెంగ్రె, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారి తిరుపతి, కౌన్సిలర్లు సాలంబిన్ అహ్మద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చౌక ధరలకే జనరిక్ ఔషధాలు
జనరిక్ మెడికల్ షాపుల ద్వారా రోగులకు చౌ క ధరలకే ఔషధ మందులు లభిస్తాయని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును బుధవారం వైద్య క ళాశాల ప్రిన్సిపాల్ వెంకట్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్తో కలిసి ప్రారంభించారు.
మైనార్టీ సంక్షేమ
అధికారిగా లక్ష్మీనారాయణ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారిగా జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ కె.హరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లక్ష్మీనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.


