రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో బుధవారం పర్యటించారు. జీఎం శ్రీ రమేశ్‌తో కలిసి ముందుగా గోలేటి ఓసీపీ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి గోలేటి ఓసీపీ పనిస్థలాలు, విస్తరణ ప్రదేశాలను తిలకించారు. ఓసీపీ ఏర్పాటుకు అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఖైరిగూర ఓసీపీ పనిస్థలాలను వ్యూ పాయింట్ వద్ద నుంచి పరిశీలించారు. ఇటీవల ఖైరిగూర ఓసీపీకి జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్ రావడంపై అధికారులను అభినందించారు. అనంతరం గోలేటిలోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులో గా వందశాతం సాధించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని సూచించారు. ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఇన్చార్జి ఏరియా ఇంజినీర్ జ్ఞానేశ్వర్, ప్రాజెక్టు ఇంజినర్ నరేశ్, ఖైరిగూర ఇన్చార్జి మేనేజర్ గౌతం రాజేశ్, ఇన్చార్జి సెక్యూరిటీ అధికారి రాజేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


