గడువులోగా సమాచారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సమాచారం ఇవ్వాలి

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు చేసుకున్న వారికి గడువులోగా సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రజా సమాచార అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 28న సమాచార హక్కు చట్టం కమిషన్‌ సభ్యులు జిల్లాకు రానున్నారని తెలిపారు. కమిషన్‌కు అప్పీలు కోసం వెళ్లిన దరఖాస్తులకు అవసరమైన సమాచారం దరఖాస్తుదారులకు అందించి, సోమవారంలోగా కలెక్టరేట్‌లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరాలి..

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి చేరాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. ప్రతిష్టాత్మకమైన కాన్పూర్‌ ఐఐటీకి ఎంపికైన కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన పెరుగు దేవాజీ, కవిత దంపతుల కుమారుడు సాయిరాంను కలెక్టరేట్‌లో శుక్రవారం అభినందించారు. ఉన్నత విద్యకు ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌ అందించారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని సూచించారు.

రైతులకు రీసర్వే సమాచారం ఇవ్వాలి

కెరమెరి: భూముల రీసర్వే సమాచారం రైతులకు ముందుగానే ఇవ్వాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండలంలోని నాగాపూర్‌ గ్రామంలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతీ రైతు సర్వేలో హాజర య్యే విధంగా చూడాలన్నారు. రీ సర్వే ద్వారా భవి ష్యత్తు గెట్టు పంచాయతీలు, భూ సమస్యలు ఉండవని తెలిపారు. ప్రక్రియ నిర్వహణ కోసం మండలా నికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్వే అధికారులకు పలు సూచనలు చేశారు. సావర్‌ఖేడా సర్పంచ్‌ కావ్‌డే తుల్సిరాం, ఉప సర్పంచ్‌ ఎనుముల శ్రావణ్‌, సర్వే డీటీ శ్రావణ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement