అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపాలి | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక కార్యక్రమాలు రూపుమాపాలి

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

తిర్యాణి: క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యక్రమాలు పూర్తిగా రూపుమాపాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం తిర్యాణి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో వివిధ రికార్డులు, పెండింగ్‌ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు వంటి అంశాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. గంజాయి, గుడుంబా, రేషన్‌ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్‌కుమార్‌, ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement